కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మహిళలు టికెట్లు కొనుక్కొని బస్సులో ప్రయాణించేదుకు ముందుకొస్తున్నారని డీకే శివకుమార్ అన్నారు. అందువల్ల ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని మరోసారి సమీక్షిస్తామని పేర్కొన్నారు.
Also Read: ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు
డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తాం
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బుధవారం ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీకే శివ కుమార్ మాట్లాడారు. సోషల్ మీడియా, ఈ మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తామని మాకు చెప్పారని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తామని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు హామీల్లో ఫ్రీ బస్ స్కీమ్ కూడా ఒకటి. అధికారంలోకి వచ్చాక 2023 జూన్ 11న ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రారంభించింది.
Also Read : అప్పుడే కిరణ్ అబ్బవరం 'క' ఓటీటీ అప్డేట్.. ఆ సంస్థకే ఓటీటీ హక్కులు
ఈ ఏడాది అక్టోబర్ 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ రూ.7 వేల 507 కోట్లను ఖర్చు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు బస్సుల్లో టికెట్లకు డబ్బులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నా కూడా కండక్టర్లు తీసుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని డేకే శివకుమార్ అన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో ఈ విషయంపై చర్చిస్తామని.. ఆ తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Also Read: వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్
మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకా ఈ స్కీమ్ కొనసాగుతూనే ఉంది. అయితే కర్ణాటకలో ఈ ఫ్రీ బస్ స్కీమ్ పై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ అక్కడ ఫ్రీ బస్సు స్కీం రద్దయితే.. త్వరలో తెలంగాణలో కూడా ఇది రద్దయ్యే అవకాశాలు ఉంటాయని పులువురు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!