Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్‌ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నెట్టింట వెల్లడించిన స్టోక్స్.. వెలకట్టలేని మెడల్స్ తిరిగి ఇవ్వాలంటూ దొంగలను రిక్వెస్ట్ చేశాడు. 

author-image
By srinivas
New Update
dgfdfed

Ben Stokes: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కు దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు, మెడల్స్, తదితర సామాగ్రి దోచుకెళ్లినట్లు స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు అతను పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఈ దారుణం జరగగా.. అగంతకులు తీసుకెళ్లిన పలు వస్తువుల ఫొటోలను షేర్ చేస్తూ ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చాడు. 

Also Read :  సీజేఐ పేరుతో ఉత్తర్వులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాల్లు!

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

దయచేసి వాటిని తిరిగి ఇవ్వండి.. 

‘అక్టోబర్ 17న ఇంగ్లండ్‌లోని నార్త్ఈస్ట్ కాస్టల్‌ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో నా భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వారికి ఎలాంటి హానీ జరగలేదు. కానీ నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. నాకు, నా కుటుంబానికి ఆ వస్తువులతో గొప్ప అనుబంధం ఉంది. వాటిని రిప్లేస్‌ చేయడం కష్టం. దయచేసి ఈ చర్యకు పాల్పడ్డవారు వాటిని తిరిగి ఇవ్వండి. ఇది నన్ను మానసికంగా కలవరపరిచింది. చాలా వస్తువులను కోల్పోయా. వాటికి విలువ కట్టలేను. ఇప్పుడు ఫొటోలను షేర్ చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఎవరికైనా దొరికితే అందిస్తారనే ఆశిస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

ఇది కూడా చదవండి: కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తాం.. కానీ : నయీం ఖాసీం

ఇక దొంగలు ఎత్తుకెళ్లిన దాంట్లో డిజైనర్‌ బ్యాగ్, క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ఇచ్చిన మెడల్‌ ఉన్నట్లు స్టోక్స్ తెలిపాడు. 

Also Read :  మెటాలిక్ అవుట్ ఫిట్ లో.. అనన్య హాట్ ఫొటో షూట్!

Advertisment
తాజా కథనాలు