ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు గతేడాది జరిగిన ఖలిస్థానీ దాడులు వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్‌షా హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల ఆరోపించారు. అయితే భారత్‌పై ఆరోపణలు చేసినప్పటికీ తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కూడా ట్రూడో పేర్కొన్నారు. By Kusuma 31 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి కెనడాలోని ఖలిస్థానీలపై చేసిన దాడుల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కెనడాలోని ఖలిస్తానీలపై చేసిన దాడులకు అమిత్ షా అనుమతి ఇచ్చినట్లు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ తెలిపారు. ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే! అమిత్ షా హస్తం ఉందని.. ఇటీవల ఓ కార్యక్రమంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ మాట్లాడుతూ.. కెనడాలోని ఖలిస్తానీ నిజ్జర్ హత్య కేసులో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు. ఉగ్రవాది అయిన హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులోని దర్యాప్తు విషయాలను కావాలని అమెరికాలోని వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేసినట్లు తెలిపారు. ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే? ఈ క్రమంలో అమెరికా స్పందిస్తూ.. ఖలీస్థానీ దాడుల వెనుక అమిత్ షా పేరు ఉండటం ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఆందోళనగా ఉన్నాయని, కెనడా దేశంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా మోరిసన్ దేశ పార్లమెంట్ ముందు అమిత్‌షా పేరునే వాషింగ్టన్ పోస్టుకు వెల్లడించారట. స్వయంగా అమిత్ షానే దాడులకు ఆదేశాలు జారీ చేశారని మోరిసన్ కూడా తెలిపారు. ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి గతేడాది ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలో కొందరు కాల్చి చంపారు. దీని వెనుక భారత్‌లోని ముఖ్య పదవుల్లో ఉన్న వారి పాత్ర ఉందని ఆరోపించింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆరోపణలను కూడా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆరోపణలు అయితే చేస్తున్నాం. కానీ ఎలాంటి ఆధారాలు కూడా లేవని కెనడా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకు భారత్ కానీ, అమిత్ షా కాని ఇంకా స్పందించలేదు. ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే! #amith-sha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి