అప్పుడే కిరణ్ అబ్బవరం 'క' ఓటీటీ అప్డేట్.. ఆ సంస్థకే ఓటీటీ హక్కులు నేడు దీపావళి కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ఫిల్మ్ 'క' పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇంతలోనే ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'క' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవి విన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Archana 31 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update KA Movie షేర్ చేయండి KA Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'క'. 1970 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన చిత్రాన్ని సుజిత్, సుదీప్ తెరకెక్కించారు. నేడు దీపావళి కానుకగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. 1970 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాజిటివ్ రివ్యూలతో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ సైతం సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో కిరణ్ ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ రోల్లో కనిపించాడు. Rustic thriller is my personal fav genres, and I've been hearing great things about #KA, especially about the mind-blowing climax twist🔥, waiting to watchTelugu cinema needs these rooted stories. Hearty congratulations to our @Kiran_Abbavaram, @connect2vamsi, and the entire… pic.twitter.com/gC23R6jwqM — Director Maruthi (@DirectorMaruthi) October 31, 2024 Also Read: పుష్ప 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్.. శ్రీవల్లి, పుష్పరాజ్ రొమాంటిక్ పోస్టర్ ఓటీటీ అప్డేట్ ఓ వైపు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే.. ఇంతలోనే ఈ మూవీ ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'క ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవి విన్ సొంతం చేసుకోగా.. శాటిలైట్ హక్కులను ఈటీవి దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు టాక్. శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కిరణ్ సరసన యంగ్ బ్యూటీ తాన్వి, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్ గా నటించారు. Also Read: బాలీవుడ్ లో రష్మిక హవా.. మరో ప్రాజెక్ట్ ఒకే చేసిన బ్యూటీ.. కొత్తగా టైటిల్ Also Read: బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి