Diwali Gift: వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్​ ఇన్సూరెన్స్‌

దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందనున్నారు.

author-image
By Manogna alamuru
New Update
hh

Free Health Insurence: 

దేశంలో 70ఏళ్లకు పైబడి వృద్ధులకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్​ భారత్'​ను ప్రధాని నరేంద్ర మోదీ ​మంగళవారం ప్రారంభించారు. దిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఆయుర్వేద-ఏఐఐఏలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన వారికి 'అయుష్మాన్ భారత్ వయ వందన' కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగతి వేగం పుంజుకుంటుందని అన్నారు.  "పేద ప్రజల కోసం రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారు. 70ఏళ్లకు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్​ కింద కవర్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈరోజు నేరవేర్చాం. ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు.

ఇక తీవ్రమైన వ్యాధులు వస్తే- దాని చికిత్సకు అయ్యే ఖర్చు విని వణికిపోయేవారు. డబ్బు లేకపోవడం వల్ల వైద్యం చేయించుకోలేని నిస్సహాయత ఉండేది. ఆ నిస్సహాయతలో నా పేద సోదరీమణులను చూడలేకపోయాను. అందుకే అయుష్మాన్ భారత్​ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాము" అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: Indo-China: అమల్లోకి గస్తీ ఒప్పందం..బలగాల ఉపసంహరణ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు