US Visa: అమెరికా వెళ్లడం కష్టమే.. నిజం చెప్పినా వీసా రావట్లేదు

ప్రస్తుతం భారతీయులకు అమెరికా వీసా దొరకడం కష్టమైపోయింది. తాజాగా ఓ భారతీయుడు.. ఇంటర్వ్యూలో నిజం చెప్పినా కూడా అతనికి వీసా తిరస్కరించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమాచారం కోసం ఈ టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
US Visa

US Visa

భారతీయ విద్యార్థుల్లో చాలామందికి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలనే కల ఉంటుంది. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వీసా దొరకడం చాలా కష్టమవుతోంది. చివరికీ అమెరికా పర్యటన వెళ్లాలనుకునే వారికి కూడా నిరాశే ఎదురవుతోంది. తాజాగా ఓ భారతీయుడు..  ఇంటర్వ్యూలో నిజం చెప్పినా కూడా అతనికి వీసా తిరస్కరించారు. తనకు జరిగిన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు.   

Also Read: హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..

Also Read :  విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హ్యాలిడేస్

Man's US Visa Rejected In 40 Seconds

రెడిట్‌లో  ‘nobody01810’ అనే పేరు గల ఓ యూజర్‌ దీనిపై పోస్ట్ చేశాడు. '' ఇటీవల బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ కోసం యూఎస్‌ ఎంబసీకి వెళ్లాను. అక్కడ మూడు ప్రశ్నలు అడిగారు. కానీ నిమిషంలోపే నన్ను రిజెక్ట్ చేశారు. అమెరికా ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారు ? అక్కడ మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా?, భారత్‌ బయట ఎప్పుడైనా పర్యటించారా ? అని అడిగారు. నేను వీటికి నిజాయతీగానే సమాధానాలు చెప్పాను. 

రెండు వారాల వెకేషన్ కోసం ట్రిప్‌ కోసం ఫ్లోరిడా వెళ్లాలని ఉంది. నాకు అక్కడ గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది. ఇప్పటిదాకా భారత్‌ దాటి బయటికి ఎక్కడికీ వెళ్లలేదు అని చెప్పాను. నేను చెప్పిన సమాధానాలు ఎంబసీ అధికారిక నచ్చలేదేమే.. నాకు వీసా రాదని చెప్పి రిజెక్ట్ అయిన స్లిప్‌ను నా చేతికి ఇచ్చారని'' ఆ యూజర్ రాసుకొచ్చాడు. కేవలం రెండు వారాలు అక్కడ పర్యటించి.. మళ్లీ ఇండియాకు తిరిగి రావాలని అనుకుంటున్నానని చెప్పానని.. వీసా ఎందుకు తిరస్కరించారో మాత్రం అర్థం కావడం లేదని చెప్పారు. 

Also Read: కాబోయే అల్లుడితో అత్త జంప్‌ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్‌.. అంతా అత్తే చేసిందన్న అల్లుడు

అయితే అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''గర్ల్‌ఫ్రెండ్ గురించి ఎందుకు చెప్పావని.. అదే మీరు చేసిన తప్పని కొందరు చెబుతున్నారు. ఆమె సాయంతో అక్కడే అమెరికాలో అక్రమంగా ఉండిపోతారేమోనని వారు భయపడినట్లున్నాకరని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 

Also Read :  ముగిసిన జుకర్‌ బర్గ్‌ విచారణ!

 telugu-news | rtv-news | national-news | us-visa

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు