హైదరాబాద్ మెట్రోలో యాక్సిడెంట్.. డోర్ మధ్యలో ప్యాసింజర్ ఇరుక్కోవడంతో..!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. మెట్రో రైల్లో ఒక్కసారిగా సెన్సార్ పనిచేయలేదు. దీంతో ఓ ప్యాసింజర్‌ డోర్‌లో ఇరుక్కుపోయాడు. చివరికి అక్కడున్నవారి సాయంతో ఆ ప్యాసింజర్‌ బయటపడ్డాడు.

New Update
Hyderabad Metro

Hyderabad Metro

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. మెట్రో రైల్లో ఒక్కసారిగా సెన్సార్ పనిచేయలేదు. దీంతో ఓ ప్యాసింజర్‌ డోర్‌లో ఇరుక్కుపోయాడు. చివరికి అక్కడున్నవారి సాయంతో ఆ ప్యాసింజర్‌ బయటపడ్డాడు. అతడికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

ఇదిలాఉండగా.. ఇటీవల మలక్‌పెట్‌ మెట్రోస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. పార్క్‌ చేసిన బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు వ్యాపించి ఆ బైక్‌ పక్కన ఉన్న మరో 4 బైక్‌లు కూడా కాలిపోయాయి. మెట్రో స్టేషన్‌ కింద దట్టమైన పొగ కమ్ముకుంది. అక్కడున్న ప్రయాణికులు, వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదం వల్ల మలక్‌పెట్-దిల్‌సుఖ్‌నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు