Manipur Governor: అప్పటిలోగా ఆయుధాల్ని అప్పగించండి.. లేకపోతే.. మణిపుర్‌ గవర్నర్‌ హెచ్చరిక

మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్‌ భల్లా కీలక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను 7 రోజుల్లోగా అప్పగించాలని కోరారు. నిర్ణీత సమయం దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
Manipur Governor’s offer, Return looted weapons in next 7 days

Manipur Governor’s offer, Return looted weapons in next 7 days

Manipur Governor: మణిపుర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్‌ భల్లా(Ajay Kumar Bhalla) కీలక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను 7 రోజుల్లోగా అప్పగించాలని కోరారు. లేకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. '' మణిపుర్‌లో లోయ, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు 20 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ

అన్నివర్గాల వాళ్లు శత్రుత్వాన్ని వీడి శాంతిభద్రతలు కాపాడుకునేందుకు ముందుకు రావాలి. ముఖ్యంగా యువత అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా అవుట్‌ పోస్ట్‌ / భద్రత దళాల క్యాంపుల్లో అప్పగించాలి. ఏడు రోజుల్లోగా తిరిగి ఇస్తే ఎలాంటి చర్యలు ఉండవు. నిర్ణీత సమయం దాటితే కఠిన చర్యలు తప్పవు. శాంతి కోసం, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందా. ముందుకు వచ్చి, శాంతి మర్గాన్ని ఎంచుకోండని'' మణిపుర్ గవర్నర్ అన్నారు.   

Also Read: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?

ఇదిలాఉండగా..

దాదాపు రెండేళ్ల నుంచి మెయిటీ, కూకీ జాతుల మధ్య అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం బీరెన్‌ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అలాగే అధికారాలన్ని గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. మెక్సికో అధ్యక్షురాలు షేన్‌బామ్

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు