Sheinbaum: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. మెక్సికో అధ్యక్షురాలు షేన్‌బామ్

వలసదారులను బహిష్కరించడం, పరస్పర సుంకాల బెదిరింపు వంటి ట్రంప్ చర్యలకు భయపడటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ అన్నారు. మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

New Update
Trump and Sheinbaum

Trump and Sheinbaum

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సుంకాలు విధించడం, వలసదారుల బహిష్కరణ అంశాలు దుమారం రేపుతున్నాయి. వీటిపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ స్పందించారు. ట్రంప్ చర్యలకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. మీడియా సమావేశంలో ట్రంప్‌ హెచ్చరికలకు భయపడుతున్నారా ? అని ప్రశ్నకు.. షేన్‌బామ్ ఇలా సమాధానమిచ్చారు.  

Also Read: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లిపేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!

'' డ్రగ్స్ ముఠాలను కట్టడి చేసేందుకు మిలిటరీ జోక్యం, వలసదారులను బహిష్కరించడం, పరస్పర సుంకాల బెదిరింపు వంటి ట్రంప్ చర్యలకు నేను భయపడటం లేదు. నాకు మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని'' షేన్‌బామ్ అన్నారు. 

ట్రంప్‌ మెక్సికోపై విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు ఆపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్‌లో సమావేశం కానున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికాలోకి ఫెంటానిల్‌ డ్రగ్‌ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అరికట్టడంలో మెక్సికో, కెనడాలు ఫెయిల్ అయ్యాయని ట్రంప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయా దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు.

Also Read: పుష్పగాడి రూల్.. కంపెనీ ఇచ్చిన టైంలోనే టాయిలెట్ బ్రేక్.. వినలేదో అంతే సంగతి!

అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ట్రంప్ సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకాలు చేశారు. దీంతో కెనడా, మెక్సికోలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యాయి. అనంతరం సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నానని ట్రంప్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే మెక్సికోకి చెందిన ఫెంటానిల్‌ డ్రగ్‌తో పాటు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు 10 వేల మంది సైనిక బలగాను ఉత్తర సరిహద్దుకు మెక్సికో తరలించింది. దీంతో ట్రంప్ పరస్పర సుంకాలు విధిస్తూ ప్రకటన చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు