/rtv/media/media_files/2025/02/27/CXdGnyFilHA7M3uIFvHv.jpg)
CM Mamata Benarjee
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ..ఎలక్షన్ కమిషన్ (EC) సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి ఫేక్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని విమర్శించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానంటూ హెచ్చరించారు.
Also Read: కోమాలో భారతీయ విద్యార్థిని.. తండ్రి అత్యవసర ప్రయాణం కోసం కేంద్రం సాయం!
Fake Voter Allegations Against BJP
తృణమూల్ కాంగ్రెస్ (Congress) సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతేకాదు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపై కూడా దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తోందని విమర్శించారు. 2006లో భూసేకరణకు వ్యతిరేకంగా 26 రోజుల పాటు జరిగిన నిరాహార దీక్షను కూడా గుర్తుచేశారు. ఓటర్ల జాబితాను వెంటనే సరిచేసి, ఫేక్ ఓటర్లను తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన
ఎన్నిక ఫలితాలను మార్చేందుకు గుజరాత్, హర్యానా ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని ఆరోపణలు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇలాంటి వ్యూహాలనే అమలు చేసిందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే విజయం సాధించలేమని బీజేపీకి తెలుసని.. అందుకే తప్పుడు ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో పడిందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ రావని.. బయటి వ్యక్తులు పశ్చిమ బెంగాల్‌ను స్వాధీనం చేసుకోలేరన్నారు. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 294 స్థానాలకు గాను 215 చోట్ల గెలుస్తామని దీదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చార్రా బాబు.. సూటు బూటు వేసుకొని ఇవేం చేష్టలు..
Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్