బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఐరాస శాంతి పరిరక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మైనార్టీల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

New Update
MAMATA BENARJEE

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలు, దేవాలయాలపై దాడులు జరగడం వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఐరాస శాంతి పరిరక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మైనార్టీల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు.'' బంగ్లాదేశ్‌లో మనవాళ్లు, మన కుటుంబాలు, మన ఆస్తులు ఉన్నాయి. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భారత్ చొరవ తీసుకోవాలి.  

Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే!

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే దాన్ని మేము సహించలేము. బంగ్లాదేశ్‌లో భారతీయులను తిరిగి ఇక్కడికి తీసుకొస్తాం. ఈ విషయాలను కేంద్రప్రభుత్వం ఐరాస దృష్టికి తీసుకెళ్లాలి. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోవాలని భావించడం లేదు. గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులు ఉన్న బోటు పొరపాటున భారత జలాల్లో బోల్తా పడింది. ఈ సమయంలో బెంగాల్ ప్రభుత్వమే జాలర్లను కాపాడిందని'' మమతా బెనర్జీ అన్నారు. 

Also Read: కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

ఇదిలాఉండగా.. ఇటీవల ఢాకాలో హిందువులు ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌.. బంగ్లాదేశ్‌ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 18 మందిని కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. చత్తోగ్రామ్‌ జైల్లో ఉన్న ఆయన్ని కలిసేందుకు వెళ్లిన పూజారి శ్మాస్‌దాస్‌ ప్రభును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ ఇలా స్పందించారు. 

Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు