EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

EVMలను హ్యాక్‌ చేయడంతోపాటు ట్యాంపరింగ్‌ చేయగలనని చెప్పిన సయ్యద్‌ షుజా అనే వ్యక్తిపై ముంబయిలో పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇతడిపై మహారాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు నవంబర్‌ 30న కేసు నమోదు చేశారు.

New Update
EVM hack

సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయగలనంటూ చెప్పడం గమనార్హం. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండటంతో ఎన్నికల సంఘం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!

EVMలను హ్యాక్ చేయగలను

అతడు చెప్పినవి అసత్యాలని, తప్పుడు వాదనలని స్పష్టం చేసింది. మెషీన్ ఫ్రీక్వెన్సీలను వేరు చేయడం ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలనంటూ సయ్యద్ షుజా అనే వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో అతడిపై ముంబయిలో పోలీసు కేసు నమోదు అయింది. ఆ వీడియో ప్రకారం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ను హ్యాక్ చేయడమే కాకుండా.. ట్యాంపరింగ్ కూడా చేయగలనంటూ అతడు చెబుతున్నట్లు వీడియోలో ఉంది. 

Also Read: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!

అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల హ్యాక్ చేయడం గురించి అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నవంబర్ 30 ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

దీనిపై ఈసీ తాజాగా స్పందించింది. ఈవీఎంలపై అసత్య వాదనలు చేస్తున్న ఆ వ్యక్తిపై ముంబయి సైబర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 2019లో కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అతడిపై ఢిల్లీలో కేసు నమోదైందని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం అతడు ఇతర దేశంలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ కలిగిన మెషీన్ అని అన్నారు. దానికి వైఫై లేదా బ్లూటూత్‌ వంటి వాటితో అనుసంధానం చేయలేమని వెల్లడించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు