6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే! ఇండియాలోనే అతి పొడవైన రైలు సూపర్ వాసుకి. ఇది ఒక గూడ్స్ రైలు. 295 బోగీలు, 6 ఇంజిన్‌లతో నడుస్తుంది. 3.5 కి.మీ పొడవు ఉంటుంది. ఏదైనా ఒక స్టేషన్ దాటాలంటే గంట సమయం పడుతుంది. ఇది చత్తీస్‌ఘడ్ లోని ఖొర్బా నుంచి నాగ్‌పూర్ లోని రాజ్‌నంద్‌గావ్ వరకు ప్రయాణిస్తుంది. By Seetha Ram 01 Dec 2024 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి భారతదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ముందు వరుసలో ఉంటుంది. రోజుకు కొన్ని కొట్ల మంది ప్రయాణికులు ట్రైన్ ద్వారా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇక పండుగ టైం వచ్చిందంటే ట్రైన్లు కిక్కిరిసిపోతాయి. అంతేకాకుండా బస్సులకు అధిక ధర ఉండటంతో అందరూ ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. అందులోనూ ట్రైన్ జర్నీ మంచి అనుభూతిని అందిస్తుంది. Also Read: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ! ఇతర ప్రయాణ ఖర్చులతో పోల్చితే ట్రైన్ జర్నీ ధర తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చాలా సేఫ్‌గా, కంఫట్‌గా ఫీలౌతాం. అందువల్లనే ఎక్కువ మంది ట్రైన్‌లో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రైల్వే శాఖ కుడా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రకరకాల రైళ్లను అందుబాటులో ఉంచింది. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, పాసింజర్స్, మెట్రో, ఎంఎంటీఎస్, గూడ్స్ వంటి రైళ్లు ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. Also Read: ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా నడిచే మరో రైళును తీసుకొచ్చింది. వందే భారత్ పేరుతో ఈ రైళును అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రైన్ ప్రయాణికులను మరింత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వచ్చింది. అయితే ఈ ట్రైన్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే చాలా మందికి ఓ డౌట్ రావచ్చు. అతి పొడవైన రైలు ఇండియాలో ఉంటుందా?, ఉంటే అది ఎంత పొడవు ఉంటుంది?, అందులో ఎన్ని బోగీలు ఉంటాయి? అని ఎప్పుడో ఒకప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది. మీ డౌట్‌కి పరిష్కారం దొరికింది. మీకు వచ్చిన డౌట్ నిజమే. ఇండియాలో అతి పొడవైన, ఎక్కువ భోగీలతో నడిచే ట్రైన్ ఉంది. Also Read: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ! అతి పొడవైన రైలు ఇదే? అయితే అది ప్రయాణికులు ప్రయాణించే ట్రైన్ కాదు. అది ఒక గూడ్స్ ట్రైన్. సాధారంగా ఒక గూడ్స్ ట్రైన్‌కి 20 నుంచి 30 బోగీలు ఉండటం అందరం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే గూడ్స్ ట్రైన్‌కి ఏకంగా 295 బోగీలు ఉంటాయి. దీని పేరు సూపర్ వాసుకి. మరి ఇన్ని బోగీలు ఉన్న ట్రైన్‌ను లాగాలంటే ఒకటి రెండు ఇంజన్లు సరిపోవు. Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు అందువల్లనే ఈ ట్రైన్‌కు ఏకంగా 6 ఇంజిన్లు ఉంటాయి. ఈ ట్రైన్ ఏకంగా 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని కారణంగానే ఈ ట్రైన్ ఏదైనా ఒక స్టేషన్ దాటాలంటే ఏకంగా గంట సమయం పడుతుంది. ఈ రైలు చత్తీస్‌ఘడ్ లోని ఖొర్బా నుంచి నాగ్‌పూర్ లోని రాజ్‌నంద్‌గావ్ వరకు ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్‌ను 22 జనవరి 2021న ప్రారంభించారు. #train మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి