Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల హిందూ పూజారి చిన్నయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయగా.. తాజాగా శ్యామ్‌దాస్ ప్రభు అనే మరో పూజారి అరెస్టయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Dec 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. అయితే తాజాగా అల్లరి ముకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ఆ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు ఆ దేశంలో ఇస్కాన్ సంస్థను అణిచివేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ సభ్యుడు అరెస్టయ్యారు. ఛట్టోగ్రామ్‌లో ఇస్కాన్‌కు చెందిన శ్యామ్‌దాస్ ప్రభు అనే పూజారి అరెస్టయినట్లు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ఎక్స్‌తో తెలిపారు. Also Read: భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి! Hindu Priest Arrested In Bangladesh మరో ఇస్కాన్ సభ్యుడు, హిందూ ఆధ్యాత్మిక నేత చిన్నయ్ కృష్ణదాస్‌ను ఇటీవలే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాను అవమానించారని, ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారనే ఆరోపణలతో ఆయనపై రాజద్రోహం కింద అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. చత్తోగ్రామ్ జైల్లో ఉన్న ఆయన్ని కలిసేందుకు వెళ్లిన పూజారి శ్మాస్‌దాస్ ప్రభును కూడా శుక్రవారం అరెస్టు చేశారు. Also Read: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష ఇస్కాన్‌పై బంగ్లాదేశ్‌లో నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇందుకు అంగీకరించలేదు. దీనివల్ల మరో మార్గంలో ఇస్కాన్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంకు అకౌంట్లను నెలరోజుల పాటు ఫ్రీజ్ చేసింది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో 17 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇందులో 8 శాతం హిందువులే ఉన్నారు. ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు అక్కడ మైనారిటీలుగా కొన్ని హక్కులను హిందువులు అనుభవిస్తున్నారు. ఇటీవల రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైన్యం మద్దతుతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీని ప్రభుత్వంలో హిందువులపై, ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి. Also Read: ఎయిడ్స్ దినోత్సవం.. తగ్గుతున్న కేసులు #hindu-priest-arrested #telugu-news #bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి