UP:కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

కాశీ ఆలయంలో మమతా రాయ్ అనే మోడల్‌ తన పుట్టిన సందర్భంగా స్వామివారిని దర్శించుకుంది. ఆ తరువాత ఆమె స్వామి విగ్రహం ఎదుట కేక్‌ కట్‌ చేసింది.దీంతో ఆమె చేసిన పనికి భక్తులు ఆమె పై మండిపడుతున్నారు.

New Update
kasi

UP: ప్రస్తుతకాలంలో కూర్చున్న నిల్చున్న కూడా తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చూస్తున్నారు. దానికోసం ఎలాంటి పనులు  చేయడానికి అయినా సిద్దమవుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నవారు అయితే వారి ఫేమ్ ని మరింత పెంచుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ కోసం.. ప్రాణాలకు తెగిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

ఈ క్రమంలోనే తాజాగా ఓ మోడల్ చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఆలయంలోకి వచ్చిన దైవదర్శనం తరువాత ఆ మోడల్.. అక్కడే కేట్ కట్ చేయడం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాలభైరవ దేవాలయంలోకి వచ్చిన మోడల్ మమతా రాయ్.. అక్కడ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. తన పుట్టిన రోజు సందర్భంగా దైవదర్శనం చేసుకున్న మమతా ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్‌ చేసి  వేడుకలను చేసుకుంది.

Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

అయితే శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌అవుతున్నాయి.ఆ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పవిత్రమైన దేవాలయంలో మమతా కేక్‌ కట్‌ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే కానీ.. ఇలా కేక్‌ కట్‌ చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Also Read: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్

మరోవైపు వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడింది. మమతా రాయ్‌ బర్త్‌డే కేక్‌ కట్ చేస్తున్నా.. అక్కడే ఉన్న ఆలయ నిర్వాహకులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం పట్ల కాశీ విద్వాత్ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. 

Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే!

Advertisment
Advertisment
తాజా కథనాలు