SCAM: ఇదెక్కడి స్కామ్ రా బాబు: మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10 లక్షలట

బీహార్ లో ఓ కొత్త రకం స్కామ్ వెలుగుచూసింది.  ప్రెగ్నెంట్ సర్వీస్ పేరిట పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10లక్షలు ఇస్తామని..  విఫలమైతే రూ. 5 లక్షలు ఇస్తామని పలువురిని ఓ ముఠా నమ్మించి బాగానే డబ్బులు వసూలు చేసింది.

New Update
Bihar scam

Bihar scam Photograph: (Bihar scam)

బీహార్ (Bihar) లో ఓ కొత్త రకం స్కామ్ వెలుగుచూసింది.  ప్రెగ్నెంట్ సర్వీస్ పేరిట పిల్లలు లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10లక్షలు ఇస్తామని..  విఫలమైతే రూ. 5 లక్షలు ఇస్తామని పలువురిని ఓ ముఠా నమ్మించి బాగానే డబ్బులు వసూలు చేసింది. బాధితులు ఆసక్తి కనబరిచిన తర్వాత  ముఠా ఆన్‌లైన్‌లో వారి నుంచి రూ.500 నుండి రూ.20,000 వరకు రిజిస్ట్రేషన్ ఫీజులను డిమాండ్ చేస్తుంది.  అంతేకాకుండా ఆధార్,  పాన్, ఫోటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు.  

Also Read : ఏపీలో పిల్లలకు తగ్గనున్న పుస్తకాల బరువు

ఎక్కడ పరవుపోతుందో అని

ఒకవేళ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. కొందరు ఎక్కడ పరవుపోతుందో అని  భయపడి  ఆ ముఠా చేతిలో చిక్కి జేబులు గుల్ల చేసుకున్నారు . మరికొందరు అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవాడా జిల్లాకు చెందిన ప్రిన్స్ రాజ్, భోలా కుమార్ , రాహుల్ కుమార్‌లుగా గుర్తించబడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.  

Also Read :  హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్

ఈ ముఠా ముందుగా ఫేస్‌బుక్ ద్వారా ఫేక్ ప్రకటనలు ఇస్తారని..  దానికి అట్రాక్ట్ అయిన వారికి ఆ తర్వాత కాల్ చేస్తారని డీఎస్పీ ఇమ్రాజ్ పర్వేజ్ తెలిపారు. రిజస్ట్రేషన్ పేరుతో ఈ వ్యక్తులకు కస్టమర్లకు సంబంధించిన పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, సెల్ఫీని అడుగుతారని వెల్లడించారు.  రిజస్ట్రేషన్స్, హోటల్ బుకింగ్స్ పేరుతో వారినుంచి డబ్బు వసూలు చేస్తారని వెల్లడించారు.  

Also Read :  ట్రంప్‌తో చర్చలకు ఓకే చెప్పిన రష్యా

ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ (All India Pregnant Job) (బేబీ బర్త్ సర్వీస్), ప్లేబాయ్ సర్వీస్ వంటి కార్యక్రమాల ముసుగులో మోసగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దండుకుంటున్నారని పోలీసులు తెలిపారు.  ఈ ముఠా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసింది. ఇప్పటి వరకు మోసపోయిన బాధితుల సంఖ్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా వాట్సాప్ చాట్‌లు, కస్టమర్ల ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంకు లావాదేవీల సమాచారం రాబట్టామని పోలీసులు తెలిపారు.

Also Read :  చెర్రీని తొక్కేసిన బన్నీ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు