ఆంధ్రాలో వచ్చే ఏడాది నుంచి పిల్లలు హాయిగా స్కూళ్ళకు వెళ్లనున్నారు. భుజాల వంగిపోయే బరువులతో కాకుండా ఆడుతూ పాడుతూ బడులకు అటెండ్ అవనున్నారు. ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను మార్చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం సెమిస్టర్ల వారీగా అన్నింటికి కలిపి ఒకటే పుస్తకాన్ని తీసుకురానుంది. బరువు తగ్గనుంది.. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్ ఉంటుంది. రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇస్తారు. వర్క్‌బుక్ ఉంటుంది. 3 నుంచి 5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులు అన్ని కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్‌బుక్ గా వనున్నారు. అలాగే 9 నుంచి 10 తరగతులకు ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ తీసివేయనున్నారు. దీని స్థానంలో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకుని రానున్నారు. Also Read: Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్ టీచర్ల రూల్స్ కూడా మార్పులు.. దీంతో పాటు టీచర్లకు కూడా కొన్ని రూల్స్‌ను పెట్టనున్నారు. ఇందులో క్లాసులకు హాజరు కానీ టీర్లకు నెలకో పాయింట్ చొప్పున మైనస్ పాయింట్లు ఇవ్వనున్నారు. ఇవి గరిష్టంగా పది వరకు ఉంటాయి. ఇది అనుమతి లేకుండా మానేసే టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఏపీలో ఉన్న టీచర్లు అందరూ సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఆన్‌లైన్‌లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పటికే 94 వేల మంది తమ వివరాలను అప్డేట్ చేసుకున్నారు. మిగిలన వారు కూడా ఆలోపు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. దాంతో పాటూ ఉపాధ్యాయుల బదిలీకి చట్టాన్ని తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి. Also Read: USA-Russia: ట్రంప్‌తో చర్చలకు ఓకే చెప్పిన రష్యా