Mahua Moitra marries former BJD MP Pinaki Misra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్

ఎంపీ మహువా మొయిత్రా బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన జర్మనీలో వీరి విహహం జరిగింది. ఈ విషయంపై మహువా , పినాకీ మిశ్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించిన పొటోలు వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Mahua Moitra marries former BJD MP Pinaki Misra

Mahua Moitra marries former BJD MP Pinaki Misra

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 3వ తేదీన జర్మనీలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీఎంసీ ఎంపీని ఇదే విషయం అడగ్గా తెలియదన్నారు. అయితే ఈ విషయం గురించి మహువా, పినాకీ ఇద్దరు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

బంగారు రంగు చీరలో మెరిసిపోతూ..

బంగారు రంగు చీరలో మహువా మొయిత్రా, భర్త పినాకీ మిశ్రా ఆమె పక్కనే ఉన్నారు. ఈ ఫొటోలో మహువా మొయిత్రా భారీగా బంగారు నగలు ధరించింది. ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీగా పినాకీ మిశ్రా గెలిచారు. మహువా తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించింది. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

ప్రస్తుతం పినాకీ మిశ్రా వయస్సు 65 ఏళ్లు ఉండగా, మహువా మొయిత్రా వయస్సు 51 ఏళ్లు. అస్సాంలో పుట్టిన ఈమె మొదట ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో వర్క్ చేసింది. ఆ తర్వాత 2010లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. గతేడాది ఎన్నికల్లో అదే స్థానం పోటీ చేసి విజయం సాధించింది. మహువా మొయిత్రాకు గతంలోనే డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌తో వివాహం జరిగింది. కానీ వీరు తర్వాత విడాకులు తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు