తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి.

New Update
twlugu

Winter: తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: ఐపీఎల్‌ మెగావేలం.. ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఫుల్‌ లిస్ట్‌

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్‌ వ్యాధులుతో పాటు , సీజనల్‌ వ్యాధులు కూడా  మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అలాగే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తమా, సీవోపీడీ వంటి సమస్యలతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read: Google Maps: విషాదం.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మూడు పూటలా వేడి ఆహారమే తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నందున.. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Also Read: Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..!

ఎండ వచ్చాక...

ఉదయం పూట వాకింగ్ వెళ్లే అలవాటు ఉన్నవారు కూడా..ఎండ వచ్చాక వాకింగ్ వెళ్లడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.  పొగమంచు కారణంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం బెటరని వైద్యులు సూచిస్తున్నారు. 

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

అలా వీలుకాని పక్షంలో  సాయంత్రం పూట అయినా సరే వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.ఇక ఉదయం పూట చలికి ప్రయాణాలు చేసేవారు,ఇతర పనుల మీద బయటకు వచ్చేవారు కూడా ఉన్ని దుస్తులు వేసుకోవాలని.. వీలైతే చేతులకు గ్లౌజులు, ముక్కు, చెవులు మూసే విధంగా మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

ఇంట్లో ఏడాదిలోపు చిన్నారులు ఉంటే వ్యక్తిగత శుభ్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలని.. చేతులను శుభ్రపరుచుకున్న తర్వాతే పసిపిల్లలను ఎత్తుకోవాలని వైద్యులు అంటున్నారు. అలాగే వీలైనంత వరకూ బయట తిప్పకపోవటమే మంచిదని చెప్తున్నారు. భోజనం చేసేముందు చేతులు శుభ్రపరుచుకోవడం.. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో కాళ్లూ, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని  చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు అంటున్నారు.

Advertisment
Advertisment