Monalisa: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్

కుంభమేళాలో సెన్సెషన్‌గా మారిన తేనెకళ్ల సుందరీ మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. తాను ఉంటున్న ప్రదేశం, ఇల్లును చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఇటీవలే మోనాలిసా కుంభమేళా నుంచి తన సొంతూరుకు వచ్చిన సంగతి తెలిసిందే.

New Update
Maha Kumbh Viral Girl Monalisa

Maha Kumbh Viral Girl Monalisa

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల్లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా సెన్సెషన్‌గా మారింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమె కోసం అక్కడ ఫొటోగ్రఫర్లు, యూట్యూబర్లు ఎగబడ్డారు. మరికొందరు కొందరు దుండగులు వెంటపడ్డారు. ఆమె దీంతో కుంభమేళాకు తనవల్ల ఇబ్బంది కాకూడని ఇటీవల ఆమె తన స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  

Also Read: రిపబ్లిక్‌ డే కవాతులో అదరగొట్టిన ‘నారీశక్తి’..

తన తేనె కళ్లతో అందిరినీ కట్టిపడేసిన మోనాలిసా తాజాగా తన ఎక్స్‌ ఖాతాలో మరో వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడ నివసిస్తుందో, వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందో చూపించారు. మోనాలిసా మాట్లాడుతూ.. '' ఇది మా ఇల్లు, నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ ప్రాంతంలో 100 మందికి పైగా జనాలు ఉంటున్నారు. నేను పూసల దండలు అమ్మేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాను. కానీ అక్కడ దండలు అమ్మడం కుదరలేదు. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని కూడా ఎవరో హ్యాక్‌ చేశారు. నా ఐడీని హ్యాక్‌ చేసినవారు తిరిగి ఇవ్వండి. దాని నుంచి ఎంతోకొంత సంపాదించాలని అనుకుంటున్నానని చెప్పారు.   

ఇదిలా ఉండగా ప్రస్తుతం మోనాలీసాకు సంబంధించిన ఫొటోలు గానీ, వీడియోలు గానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఎక్స్‌ ఖాతాకు కూడా 14.8 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ వచ్చేశారు. అందులో ఆమె పెట్టిన వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు