Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపుగా 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
mAHAKUMBHMELA

mAHAKUMBHMELA Photograph: (mAHAKUMBHMELA)

నేడు మౌని అమావాస్య కావడంతో మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో మహా కుంభమేళానికి వెళ్లే అన్ని రహదారుల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కైమూర్ జిల్లాలోని కుద్ర సమీపంలో ఎన్‌‌హెచ్ 19 రెండు లేన్లలో కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపుగా 50 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చూడండి:Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఇది కూడా చూడండి:Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

దాదాపు 24 గంటల పాటు..

కనీసం అంబులెన్స్ కూడా వెళ్లడానికి దారి లేకుండా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపుగా 24 గంటల పాటు కొందరు ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. కొన్ని గంటల పాటు కనీసం వాహనాలు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉన్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే అన్ని రహదారులు కూడా వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అమృత స్నానాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇది కూడా చూడండి:Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

ఇది కూడా చూడండి:Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్

Advertisment
తాజా కథనాలు