Hyderabad: కూకట్పల్లి వైపు వెళ్తున్నారా? కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
కూకట్పల్లిలోని జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై నిలిచిపోయారు.