ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

భార్య అనుమతి లేకుండా భర్త లైంగికచర్యకు పాల్పడితే నేరంకాదని చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2017లో అసహజ లైంగిక చర్యకు గురైన మహిళ కేసు విచారిస్తున్నప్పుడు సింగిల్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. అసహజ లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది.

New Update
FotoJetChhattisgarh High Court

FotoJetChhattisgarh High Court Photograph: (FotoJetChhattisgarh High Court )

భార్య అనుమతి లేకుండ భర్త లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదని చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో తన అనుమతి లేకుండా భర్త అసహజ లైంగిక చర్యకు గురైన ఒక మహిళ కేసును విచారిస్తున్నప్పుడు సింగిల్  బెంచ్ ఈ తీర్పు చెప్పింది. సదరు మహిళ అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఆమె ఇచ్చిన మరణవాగ్మూలంలో తన చావుకు భర్తే కారణమని చెప్పింది. దీంతో ట్రయల్ కోర్టు భర్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భర్త హైకోర్టును ఆశ్రయించాడు.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మసనం జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఈ కేసును విచారించారు. భార్య మైనర్ అయితే వారి మధ్య జరిగిన లైంగిక చర్యను మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం కాదు. భార్య 18 ఏళ్లలోపు ఉంటేనే వివాహాలలో బలవంతంగా లైంగిక సంబంధం నేరం అవుతుంది. అసహజ లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసి భర్తను నిర్దోషిగా విడుదల చేసింది. భర్తపై మోపిన ఐపిసి సెక్షన్ 376, 377 కింద నేరం రుజువైనది కాదని హైకోర్టు భావించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు