/rtv/media/media_files/2025/08/02/madras-high-court-restrains-tamil-nadu-from-naming-schemes-after-mk-stalin-2025-08-02-17-44-06.jpg)
Madras High Court restrains Tamil Nadu from naming schemes after MK Stalin
సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు ఆ పార్టీ వ్యవస్థాపకుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు పెడుతుంటారు. ఈ స్కీమ్స్‌కు వాళ్ల ఫొటోలు కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి విధానానికి మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది. తమిళనాడులో సీఎం స్టాలిన్ పేరుతో నడుస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో స్టాలిన్ పేరుతో పాటు మాజీ సీఎం కరుణానిధి ఫొటోలు వాడటాన్ని తప్పుబట్టింది. ప్రజల డబ్బుతో నడిచే సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని.. ఏ పార్టీ నాయకుడిని కూడా తమ వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకోవద్దని ఆదేశించింది.
ఇటీవల అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉంగలుడన్ స్టాలిన్ లాంటి ప్రభుత్వ పథకాలకు మాజీ సీఎం కరుణానిధిని, ప్రస్తుత సీఎం పేరును అధికార పార్టీ వాడుతోందని అందులో ఆరోపించారు. ప్రచార సామాగ్రిలో కరుణానిధి ఫొటోలు ప్రచూరించి రాజకీయ లబ్ధి పొందుతోందని చెప్పారు. ఇది 2014లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు, ప్రభుత్వ ప్రకటన గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ పి.విల్సన్ దీనిపై వాదించారు. సీవీ షణ్ముగం చేసిన పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైందని ధ్వజమెత్తారు.
Also Read : పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త వ్యూహం.. అప్రమత్తమైన భారత్
Madras High Court Restrains Tamil Nadu
ప్రధాని మోదీ పేరుతో నమో, మాజీ సీఎం జయలలిత పేరుతో అమ్మ లాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాంటప్పుడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం కరుణానిధి పేరును వాడటం తప్పెందుకు అవుతుందని ప్రశ్నించారు. చివరికి ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ పథకాల అమలుకు తాము వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడం లేదని.. కానీ మాజీ సీఎంలు, బతికి ఉన్న నేతల ఫొటోలు వాడటం అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే అధికార పార్టీ పేరును గానీ, గుర్తును గానీ వాడుకోవడం ఎన్నికల సంఘం ఉత్తర్వులకు విరుద్ధమని తేల్చిచెప్పింది.
అయితే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే, అలాగే అమల్లో ఉన్న స్కీమ్స్‌పై ప్రకటనల్లో రాజకీయ నేతల పేరు, మాజీ సీఎం ఫొటోలు వాడకూడదని స్పష్టం చేసింది. అలాగే ఈ విచారణను ఆగస్టు 13కు విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.తమపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని AIDMK పై అధికార డీఎంకే పార్టీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, జయలలిత పేర్లను వాడుకుంటే తప్పులేదు గానీ తమ నేతల పేర్లు వాడుకోవద్దని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసును కోర్టు ఆగస్టు 13కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు దీనిపై న్యాయస్థానం ఏం చెబుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read : తల్లిని కాటేసిన పాము.. వీపుపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కూతురు.. కన్నీళ్లు పెట్టించే వీడియో
madras-high-court | CM Stalin | tamilnadu | rtv-news | telugu-news | national news in Telugu | latest-telugu-news