Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.