/rtv/media/media_files/2025/07/15/rajinikanth-next-project-with-maharaja-director-2025-07-15-18-12-24.jpg)
rajinikanth next project with maharaja director
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తమిళ్లో విడుదలైన 'మహారాజా' అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు నితిలన్ స్వామినాథన్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా నితిలన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి
రజినీకాంత్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్
నితిలన్ స్వామినాథన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ వార్తలు రజినీకాంత్ అభిమానుల్లో, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే నితిలన్ స్వామినాథన్ రజినీకాంత్‌కు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథను వినిపించారని, ఆ కథ తలైవాకు బాగా నచ్చిందని సమాచారం. కథతో రజినీకాంత్ పూర్తిగా సంతృప్తి చెందారని, ప్రస్తుతం నితిలన్ స్క్రీన్‌ప్లేను తుది దశను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Latest Buzz : Potential Collaboration between Superstar & Nithilan Saminathan (Maharaja) after Jailer 2. pic.twitter.com/u8oKSz8bPP
— Insplag (@CcInfilmin) July 14, 2025
Also Read: Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రజినీకాంత్ ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్' సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది.
Also Read:BIG BREAKING: తెలంగాణ హైకోర్టులో చిరంజీవి పిటిషన్.. ఆ అంశంపై కోర్టుకెక్కిన మెగాస్టార్!
Also Read : బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
maharaja-movie | rajinikanth | Vijay Sethupathi