LeT Member: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే

లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. నవంబర్‌ 27న ఎన్‌ఐఏ, సీబీఐ నిందితుడిని ఇంటర్‌పోల్‌ సహకారంతో ఇండియాకు రప్పించింది.

New Update
ruvanda

పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. ఇంటర్‌పోల్‌ సహకారంతో తాజాగా అతడిని సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారత్‌కు రప్పించాయి. దీనికి సంబంధించిన విషయాలను అధికారులు గురువారం వెల్లడించారు.    

Also Read: ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్..

Lashkar-e-Taiba

ఇక వివరాల్లోకి వెళ్తే.. లష్కరే తోయిబా ముఠాకు చెందిన సల్మాన్ రెహ్మాన్‌ ఖాన్ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. బెంగళూరులో జైళ్లపై జరిగిన ఉగ్రదాడులకు.. అతడు పేలుడు పదార్థాలను, ఆయుధాలను సరఫరా చేశాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఈ కేసుపై రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. రెహ్మాన్ విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది. ఆ తర్వాత సీబీఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు 2న అతడిపై రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసింది. 

Also Read: బీజేపీకే సగం మంత్రిత్వ శాఖలు.. షిండేకు ఆ పదవి ఖరారు !

అతడి ఆచూకి కనిపెట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. చివరికి అతడు రువాండాలో ఉన్నట్లు గుర్తించింది. దీంతో నవంబర్ 27న కిగాలీ అనే ప్రాంతంలో ఆ నిందుతుడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థ.. ఇంటర్‌పోల్‌ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించింది. గురువారం అతడు ఇండియాకు రాగా.. ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు విచారిస్తోంది. 

Also Read: పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి

Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు