Air Pollution: పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి

పరిశ్రమలతో పాటు కార్చిచ్చు వల్ల రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
POLLUTION

ప్రస్తుతం వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. పరిశ్రమలతో పాటు కార్చిచ్చు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతోందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వందల ఎకరాల్లో అడవులు కాలిపోవడం, అలాగే పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాయి కాలుష్యం ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ది లాన్సెట్ జర్నల్ చేసినటువంటి తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

అంతర్జాతీయ పరిశోధకులు బృందం పలు వివరాలు వెల్లడించారు. ''అడవిలో చెలరేగే మంటలు, వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా పెరుగుతోంది. ఈ వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2000-2019 మధ్య ఈ కార్చిచ్చు గాలి కాలుష్యం వల్ల ప్రతీ సంవత్సరం 4,50,000 మంది గుండె జబ్బులతో, మరో 2,20,2000 మంది శ్వాసకోస సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 90 శాతం పేద, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లోనే జరిగాయి. 

Also Read: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?

కేవలం ఆఫ్రికాలోనే 40 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, కాంగో దేశాల్లో అత్యధిక మరణాలు జరిగాయని'' పరిశోధకుల బృందం వివరించింది. రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు .  

Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. వచ్చే ఆరు నెలలూ పండగే

Also read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు

Advertisment
తాజా కథనాలు