పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక

ఏం మనుషులురా మీరు...ఆడాళ్ళను బతకనివ్వరా అనిపిస్తోంది యూఎన్ విమెన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన రిపోర్ట్ చూస్తే. ప్రతీ పది నిమిషాలకో అమ్మాయి లేదా మహిళను చంపేస్తున్నారని ఈ రిపోర్ట్‌లో తేలింది.

New Update
pharmacy student was gang raped in Warangal

మహిళలు, బాలికల మీద జరుగుతున్న హింస, అత్యాచారాలు అంతే లేదు. రోజూ ప్రపంచాన్ని గమనిస్తున్నవారికి ఎవరికైనా ఇది తెలుస్తుంది. రోజులో ఎక్కడో ఒక చోట ఏదో విధంగా అమ్మాయిలు, ఆడవారు అవమానాలకు, హింసకు గురవుతూనే ఉన్నారు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు..ప్రపంచం మొత్తం అలానే ఉంది అంటోంది యూఎన్ విమెన్ వింగ్. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఓ నివేదికను సమర్పించింది. UN ఉమెన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ మహిళలపై హింస పెరుగుతుందని నివేదికలు వెల్లడించాయి. ఈ సంస్థలు విడుదల చేసిన డేటా చూస్తే భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలికని ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 25 నవంబర్ 2024 మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఇంటిమేట్ పార్ట్‌నర్, ఫ్యామిలీ మెంబర్, స్త్రీ హత్యలు తీవ్రమైనవని చెప్పాయి. స్త్రీలు, బాలికలపై హింస- ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని చెబుతున్నాయి. 

ప్రతీ పది నిమిషాలకు ఒకరు..

ప్రపంచవ్యాప్తంగా 2023లో 85వేల మంది మహిళలు, బాలికలను హత్య చేశారని UN ఉమెన్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్‌లో తేలింది.  ఈ హత్యలలో 60 శాతం బాధితులకు దగ్గర వ్యక్తులు లేదా వారి భాగస్వాములే చేస్తున్నారని చెప్పారు. ప్రతి రోజు 140 మంది మహిళలు, బాలికలు వారి భర్తలు లేదా బంధువుల చేతిలో మరణిస్తున్నారని తెలుస్తోంది. అంటే ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక హత్యకు గురౌతోంది. 2023లో మహిళల హింసలో అన్ని దేశాల కంటే... ఆఫ్రికా మొదట స్థానంలో.. ఆ తర్వాత అమెరికా ఉంది. వీటి తర్వాత ఓషియానియా, ఐరోపాల్లో మహిళలపై హింసకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేరాల్లో ఎక్కువగా భర్త, కుటుంబ సభ్యులే ప్రధాన నేరస్థులుగా ఉన్నారు. 

Also Read: AP: ఏపీ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్‌‌–హోం మంత్రి అనిత

Advertisment
Advertisment
తాజా కథనాలు