/rtv/media/media_files/2024/11/23/sLavtH657uNQx7u4TYYf.jpg)
ఈ మధ్య కాలంలో విమానాలకు, ప్రముఖులకు బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ ప్రధాని మోదీని చంపుతామంటూ.. గుర్తు తెలియని దుండగులు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు బెదిరింపు కాల్స్ చేశారు. మోదీని హత్య చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేశామని ఓ మహిళ బెదిరించింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..
హత్య చేయడానికి ప్లాన్ చేశామని..
పోలీసులు వేంటనే దర్యాప్తు చేపట్టి.. కాల్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేశారు. ఓ 34 ఏళ్ల మహిళ బెదిరింపులకు పాల్పడిందని దర్యాప్తులో తేల్చారు. వెంటనే ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళలకు గతంలో ఎలాంటి కేసులు లేవని, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో పలువురికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల షారుఖ్‌ఖాన్‌ని కూడా చంపుతామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. వారికి కాల్ వచ్చిన ఆ ఫోన్ గురించి దర్యాప్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా!
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు ముందుగా భావించారు. కానీ ఆ తర్వాత లోతుగా విచారణ చేపట్టగా.. రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అని వ్యక్తి చేసినట్లు గుర్తించారు. కాల్ వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. అయితే షారుఖ్ ఖాన్‌కి ఇప్పుడే కాదు.. గతంలో కూడా చంపుతామంటూ కాల్స్ వచ్చాయి.
ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..