/rtv/media/media_files/2025/05/25/sKmjqfPBAQNUk9slTzsk.jpg)
Lalu Yadav removes son Tej Pratap from party, family after row over viral post
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆరేళ్లపాటు ఈ బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన కొడుకు వ్యక్తిగత వ్యవహారం.. సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025
Also Read: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది
అందుకే తాను తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడికి ఆర్జేడీ పార్టీలో గానీ, తమ కుటుంబంలో గానీ స్థానం లేదన్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం తేజ్ ప్రతాప్ తన ఫెస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆయన ఓ మహిళతో కలిసి ఉన్న ఫొటో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని చెప్పుకొచ్చారు. గత 12 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తెలిపారు.
Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు
ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b
— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే లాలు ప్రసాద్ యాదవ్ కొడుకును పార్టీ నుంచి బహిష్కరిస్తూ చర్యలు తీసుకున్నారు. చివరికి దీనిపై తేజ్ ప్రతాప్ ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియాను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు. తన కుటంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే కావాలనే ఇలా పోస్టు చేశారని తెలిపారు. ఆ ఫొటో కూడా ఎడిట్ చేసిందన్నారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలు సూచించారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
telugu-news | rtv-news | bihar | lalu-prasad-yadav