IPL: ఐపీఎల్ ఆయన వల్లే సాధ్యమయ్యింది.. లలిత్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ కార్యరూపం దాల్చడంలో శరద్‌ పవార్‌ పాత్ర ఎంతో ఉందని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ అన్నారు. ఈ ఆటను గ్లోబల్ ఐకాన్‌గా నిలిపిన ఆ నేతను మర్చిపోవద్దని చెప్పారు. ఐపీఎల్‌ రూపకల్పనలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు.

New Update
Lalit Modi

Lalit Modi

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్‌కు సంబంధించి ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐపీఎల్‌ కార్యరూపం దాల్చడంలో శరద్‌ పవార్‌ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఈ ఆటను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి గ్లోబల్ ఐకాన్‌గా నిలిపిన ఆ నేతను మర్చిపోవద్దని చెప్పారు. ఐపీఎల్‌ రూపకల్పనలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తా కథనానికి లలిత్‌ మోదీ ఇలా స్పందించారు.  

Also read: 8వ తరగతి విద్యార్థి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్‌‌పై గూగుల్ సీఈఓ ప్రశంసలు

'' ఇది నిజం. శరద్‌ పవార్‌ వల్లే ఐపీఎల్‌ సాధ్యమయ్యింది. ఆయన నాపై నమ్మకం ఉంచడం, 100 శాతం ప్రోత్సహించడం వల్లే ఐపీఎల్‌ కార్యరూపం దాల్చింది. ఈ విషయంలో మనం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. నేను కన్న కలను ఆయన సాకారం చేశారు. శరద్ పవార్ దార్శనికతను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ విషయంలో ఆయనకు సెల్యుట్‌ అంటూ'' లలిత్ మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!

ఇదిలాఉండగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఓ విభాగానికి శరద్ పవార్ పేరు పెట్టాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో శరద్‌ పవార్‌ పాత్ర ఏంటీ ? ఆయన ఇందులో కీలకంగా ఎలా వ్యవహరించారు ? అనే దానిపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక శరద్‌ పవార్‌ గతంలో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా, 2010 నుంచి 2012 వరకు ఐసీసీ అధినేతగా కూడా పనిచేశారు. ఇదిలాఉండగా ఐపీఎల్‌లో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో లిలత్‌ మోదీ 2010లో యూకే పారిపోయిన సంగతి తెలిసిందే. 

Also Read: నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో

Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

 lalit-modi | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు