/rtv/media/media_files/2025/04/20/rro99lZdE03u7ZHniZL9.jpg)
airplane Bengaluru
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక టెంపో ట్రావెలర్ నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం కింద టెంపో వాహనం ఇరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, విమానం పైకప్పు దెబ్బతిందని ఇండిగో తెలిపింది.
🔴 Tempo Traveller Hits Parked IndiGo Plane at Bengaluru Airport
— NEWS8 Northeast (@news8northeast) April 20, 2025
👉 Tempo traveller hit undercarriage of IndiGo A320, grounded since 2022.
👉 Driver sustained minor injuries; van’s roof and windshield damaged.
👉 DGCA has launched an investigation into the airport collision. pic.twitter.com/e1eRk6w5H4
Also read: TGSRTC: ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ !.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
Also read : Dhanush ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్
డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా
డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించింది. దీనిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని..తర్వాత వాటిని పునరుద్ధరించామంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామన్న .. ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.
Also read : Rains alert : బయటకు వెళ్తున్నారా? జర జాగ్రత్త...రెండురోజులపాటు దంచుడే దంచుడు
Also read : Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య