/rtv/media/media_files/2025/04/13/FAtxjxTUHZeeYt0oWZb2.jpg)
Maoists huge bunkers captured police
Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి.12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
కాంక్రీట్‌తో నిర్మించిన బంకర్..
ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే బీజాపుర్ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో బంకర్‌ను గుర్తించిట్లు తెలిపారు. కోబ్రా 208 బెటాలియన్ బలగాలు జీడిపల్లి బేస్‌క్యాంపు నుంచి సమీప అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టగా.. ముర్కరాజుగుట్టల ప్రాంతంలో కాంక్రీట్‌తో నిర్మించిన బంకర్ గుర్తించాం. బాంబుడిస్పోజల్ స్క్వాడ్ (BDS) బృందం దాన్ని నిశితంగా పరిశీలించగా.. ఆ బంకర్‌లో 6 సోలార్ ప్లేట్లు, 6 జెర్కిన్లు, 2 సీలింగ్ ఫ్యాన్లు, మావోయిస్టుల యూనిఫాంలను దొరికాయి.
/rtv/media/media_files/2025/04/20/XUTkTpl6OndS1WDk7Ako.jpeg)
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
అలాగే ఇదే ప్రాంతంలో మావోయిస్టులు తల దాచుకునేందుకు వీలుగా రేకులతో 12 స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాటినికూడా తనిఖీ చేసి ధ్వంసం చేశాం. అగ్రనేతలు హిడ్మాతో పాటు మరికొంత మంది మావోలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న స్థావరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/04/20/lhlamY9BaNkoZS3VTWNp.jpeg)
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
chattisgarh | telugu-news | today telugu news