/rtv/media/media_files/2025/05/21/oJqt75Kf3XqUfBv5OOhY.jpg)
Kumki Elephants
Kumki Elephants : ఏపీ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న కుంకీ ఏనుగులు ఎట్టకేలకు రాష్ట్రానికి చేరనున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి దూసుకువచ్చి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేసి వారిని చంపటం సర్వసాధాణమైపోయింది. ఈ విషయమై ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయమై స్పందించారు. ఏనుగులను నిరోధించాలంటే కుంకీ ఎనుగులను ఏజేన్సీ ప్రాంతాల్లో మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం గతేడాది కర్ణాటకలో పర్యటించిన ఆయన ఆరు కుంకీ ఏనుగులు ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతం, మన్యం పార్వతీపురం జిల్లాలో అటవీ ఏనుగుల దాడులను అరికట్టేందుకు నేడు 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించనున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 21, 2025
ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ప్రత్యేక చొరవతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో,… pic.twitter.com/KUFOmQaGum
Also Read: ఇద్దరు బంగ్లా దేశీయులకు బిగ్ షాక్.. ఆ కేసులో కఠిన కారాగార శిక్ష
ఈ మేరకు బుధవారం కర్ణాటకలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బెంగళూరులోని విధాన సౌదాలో సీఎం సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. గతేడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు ఆరు కుంకీ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయన్నారు.చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. అలాంటి సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిరోధిస్తుందన్నారు.దానికోసం ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పవన్ కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతామన్నారు.
➡️ఆంధ్రా వాళ్ల శిక్షణ కోసమే ఏనుగులను పంపిస్తున్నాం
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) May 21, 2025
➡️శిక్షణ పొందిన ఏనుగులు అత్యధిక కర్ణాటక లొనే ఉన్నాయి
➡️అడిగిన అన్ని రాష్ట్రాలకు సహాయం చేస్తున్నాం
ఆంధ్రా ఒక్క రాష్ట్రానికే కాదు
➡️గత ఏడాది మా ఇంటికి వచ్చి కుంకి ఏనుగులు కావాలని పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు
- సీఎం సిద్ధరామయ్య… pic.twitter.com/uBTgXjddte
కుంకీ ఏనుగులు అంటే ఏమిటీ?
కుంకీ అనేవి కూడా ఏనుగులే. అయితే ఇవి పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. వాటిని తరిమివేయడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేస్తారు. దీనికి కారణం అవి ఒంటిరిగా సంచరించడానికే ఇష్టపడుతాయి. వీటిని బంధించి ఎక్కువ కాలం శిక్షణ ఇవ్వడం వల్ల రాటు దేలుతాయి. శిక్షణ అనంతరం వీటిని ఆపరేషన్ల కోసం వాడుతారు. ఏనుగుల గుంపులు గ్రామం, పొలాల్లో దాడులకు దిగినపుడు వీటిని వదులుతారు. ఇవి ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు విశ్రమించవు.
Also Read: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు