పంట పొలాలు నాశనం చేసిన ఏనుగుల గుంపు | Elephants Hulchul in Chittoor District | RTV
ఆఫ్రికాలో అరుదైన వన్య ప్రాణులను వధిస్తున్నారు. దానికి కారణం అక్కడ విలయ తాండవం చేస్తున్న కరువై కారణం. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆఫ్రికా దేశాల ప్రభుత్వమే తీసుకుంది. దీని కోసం 83 ఏనుగులు సహా పలు జంతువుల జాబితాను సిద్ధం చేసింది.
చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రూ. 2 లక్షల నష్టం వచ్చిందని వాపోతున్నాడు.
తమిళనాడు నీలగిరి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ముదుమలై నేషనల్ పార్క్లో పర్యాటకుల వాహనాన్ని ఏనుగులు వెంబడించాయి. రోడ్డు మీద వెళ్తున్న జీప్ ను రెండు గజరాజులు వణికించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు నడిపించడంతో ప్రమాదం తప్పింది. వీడియో వైరల్ అవుతోంది.
అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ జంతువులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడపాదడపా అటవీ జంతువులు దాడులు చేస్తుండటంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు.