/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy chit chat with media
లోకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ మూడుసార్లు రహస్యంగా కలిశారని, అర్థరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన రేవంత్ పలు ఆరోపణలు చేశారు. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది. వాళ్లలాగా మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని అన్నారు. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించామన్నారు. కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబ సభ్యులు బయటికి వచ్చి చెప్తున్నారన్నారు.
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Revanth Reddy Chit Chat With Media
రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్ళాలా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిదాన్ని వివాదం చేయాలని బీఆర్‌ఎస్ చూస్తుందన్నారు. కేసీఆర్‌ను కాపాడేందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయపడుతున్నారన్నారు. లేఖలతో పనులు కావాని, అధికారికంగా రివ్యూ సమావేశాలకు పిలిస్తే వెళ్తానన్నారు. కేంద్రంతో కలిసి పనిచేస్తామని, బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు. కేటీఆర్ ది గంజాయి బ్యాచ్అన్న రేవంత్ కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని సంచలన ఆరోపణ చేశారు.డ్రగ్స్ తీసుకునే వాడితో నేనేం మాట్లాడతాను వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయింది కేటీఆర్ అని ఆరోపించారు. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ అన్నారు.
గొర్రెల స్కాం, ఫార్ములా ఈ రేస్ కేసు, జీహెచ్ఎంసీ ఆఫీసర్ శివ బాలకృష్ణ కేసులో ఈడీ ఎందుకు అరెస్టులు చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ రాష్ట్ర కేసులో జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలిసి కేసీఆర్ ఫ్యామిలీ పై ఉన్న కేసులపై ఎందుకు ఫాలోఆఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయన్న రేవంత్ రెడ్డి దేనికైన సమయం రావాలన్నారు.
నాకు వ్యక్తులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పోరాటం నా చివరి అస్త్రం అన్నారు. టీఆర్ఎస్ పదేళ్లలో సాధించలేని అంశాలను నేను సాధించానన్నారు. 2018లో రిజర్వేషన్లను 23% కి కుదించింది కేసీఆర్ అని ఆరోపించారు. 50% మించేది లేదంటూ బీసీ రిజర్వేషన్ పైన కేసీఆర్ చట్టం చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఆర్ సలహాలు ఇస్తే మేము వద్దన్నామా? అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ కి నేను భయపడనని, సిస్టంకు మాత్రమే నేను భయపడతానని స్పష్టం చేశారు.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేసిన కమిషన్ల పై విచారణ కొనసాగుతుందన్న రేవంత్ రెడ్డి చట్టం పరిధిలోనే విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కొరకు బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తుంది.లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానంతోనే బీజేపీ8 సీట్లు గెలుచుకుందన్నారు. తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసి తెలంగాణలో తీసేయమని అడగాలన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం. సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్ను అడ్డుకునే ముసుగు వీరులు ఉన్నారని, పరిపాలన అంటే హైదరాబాదులో ఫామ్ హౌస్ లో కూర్చోవడం కాదని ఎద్దేవా చేశారు. తుమ్మిడి హట్టి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాను. ఇండియా పాకిస్తాన్ నీటి పంపకాలు చేసుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ చంద్రబాబు, జగన్ తో మాట్లాడినప్పుడు విజయాలుగా చెప్పుకున్నారు.ఇప్పుడు నేను సమావేశంలో పాల్గొంటే తప్పు అంటున్నారన్నారు. సమావేశాలకు వెళ్లకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? తెలంగాణ రాష్ట్ర వాదనను ఎవరు వినిపిస్తారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను రాష్ట్ర సమస్యలపై పిలిస్తే ఎందుకు వెళ్లొద్దు? నన్ను జై తెలంగాణ అనడం లేదని ఏడ్చేవాళ్ళు వాళ్లెందుకు వారి పార్టీలో తెలంగాణ పేరును తొలగించుకున్నారో చెప్పాలన్నారు. అని రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Also Read : మహారాష్ట్ర లగ్జరీ హోటల్ చుట్టూ హనీ ట్రాప్ స్కామ్..కుంభకోణంలో మాజీ మంత్రులతో పాటు 72 మంది...
harishrao | kcr | brs-mla-ktr | delhi | chit-chat | chit-chat-with-media | A media debate | ktr vs cm revanthreddy | cm-revanthreddy