India-China: భారత్‌, చైనా మధ్య విమాన సర్వీసులు

కరోనా మహమ్మరి, లడఖ్‌లో సైనికుల మధ్య ఉద్రిక్తత వల్ల భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎయిరిండియాకు సంబంధించి కూడా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఎయిరిండియా విమాన సంస్థ కూడా భారత్-చైనా మధ్య సర్వీసులను ప్రారంభించనుంది.

New Update
Air India to resume India-China flights

Air India to resume India-China flights

కరోనా మహమ్మరి, లడఖ్‌లో సైనికుల మధ్య ఉద్రిక్తత వల్ల భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 26న ఇరుదేశాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. కోల్‌కతా నుంచి ఇండిగో విమానం చైనాలోని గువాంగ్‌ఝౌలో ల్యాండ్ అయ్యింది. తాజాగా ఎయిరిండియాకు సంబంధించి కూడా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఎయిరిండియా విమాన సంస్థ కూడా భారత్-చైనా మధ్య సర్వీసులను ప్రారంభించనుంది. 

Also Read:  సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ-షాంఘై మధ్య విమాన సర్వీసును ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముంబయి-షాంఘై కొత్త రూట్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్లాన్ వేసినట్లు ఎయిరిండియా CEO క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. ఇది విద్య, వ్యాపార, సాంస్కృతిక, వైద్య సంరక్షణ లాంటి అనేక రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. అయితే వారానికి నాలుగుసార్లు ఢిల్లీ-షాంఘై మధ్య విమాన సర్వీసులు ఉంటాయని సమాచారం. 

Also Read: వణుకు పుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

ఇదిలాఉండగా చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌ సంస్థ గతవారం షాంఘై-ఢిల్లీ సర్వీసును ఏకంగా 95 శాతం ఆక్యుపెన్సీతో నడిపించింది. ఐదేళ్ల తర్వాత భారత్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపిన మొదటి చైనా విమానయాన సంస్థగా ఇది నిలిచింది. ఇండిగో కూడా గత నెలలో విమాన సర్వీసులు ప్రారంభించింది. 2020లో కరోనా, లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు