ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ, దేశ రాజధానిలో కూడా పాగా పాతాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. బీజేపీ, ఆప్‌లు ఒకరి మీద ఒకరు మాటాల తూటాలు పేల్చుకుంటున్నాయి. పోస్టర్లతో సవాల్ విసురుకుటున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుడిని అంటూ చెప్పుకునే కేజ్రీవాల్ ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారో చూడండి అంటూ బీజేపీ ఆయన ఇంటి తాలూకా వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీద ఆప్ నేతలు మండిపడుతున్నారు.
ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత
అద్దాల మేడ..
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ కోట్లు ఖర్చు చేసి ఇంటికి మార్పులు చేశారని బీజేపీ ఆరోపించింది. లిక్కర్ స్కామ్‌లో డబ్బు దోచుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుహవిస్తునారని చెప్పింది. అయినా కూడా కేజ్రావాల్ సామాన్యుడని చెప్పుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ‘ఎక్స్’ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లో ఉన్న సీఎం బంగ్లా వీడియో ఇది అంటూ వీడియో పెట్టారు. కేజ్రీవాల్.. సీఎంగా ఉన్నప్పుడు ఈ బంగ్లానే ఉపయోగించారని..ఇదొక అద్దాల మేడ అంటూ ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7-స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు సచ్ దేవ్. గ్రానైట్, లైటింగ్ కోసం రూ.1.9 కోట్లు, ఇతరత్రా సివిల్ వర్క్ కోసం రూ.1.5 కోట్లు, జిమ్, స్పా వంటి వాటి కోసం రూ.35 లక్షలు.. ఇలా మొత్తంగా రూ.3.75 కోట్లు ఖర్చు చేసి ఈ భవనాన్ని లగ్జరీగా మార్చుకున్నారని బీజేపీ నేత లెక్కలతో సహా చూపించారు. కామన్ మ్యాన్ అని చెప్పుకునే కేజ్రీవాల్ కు అంత సొమ్ము ఎలా వచ్చిందని సచ్ దేవ్ ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో చూడండి అంటూ ధ్వజమెత్తారు.
ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
ఈ వీడియోపై ఆప్ మండిపడుతోంది. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మనీశ్ సిసోడియా అన్నారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే.. వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
दिल्ली के जनता की खून-पसीने की कमाई लूट कर 'खास' आम आदमी ने खड़ा किया ये शीश महल!
— BJP (@BJP4India) December 10, 2024
देखिए, गाड़ी, बंगला, सुरक्षा नहीं लूंगा कहने वाले केजरीवाल के शीश महल की शान-ओ-शौकत... pic.twitter.com/G9Ss7ZLlR9
Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మతనాయకుడికి 50 ఏళ్లు..