/rtv/media/media_files/2025/02/03/ggKLo82CUrlnXwKlqlVK.jpg)
Karnataka Minister for Kannada and Culture, Shivaraj Tangadagi
కర్ణాటకలో కన్నడ భాష రాసేందుకు ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగడగి ఇబ్బందిపడ్డారు. శుభాకాంక్షలు అనే పదం కన్నడలో రాసేందుకు తిప్పలు పడ్డారు. ముందుగా ఆ పదాన్ని తప్పుగా రాశారు. చివరికి ఆయన పక్కనున్న వాళ్ల సాయంతో అక్షర దోషాలు సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రాష్ట్ర మంత్రి మాతృభాషలో కూడా రాయలేకపోవడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ಸಚಿವರಾದ ಶಿವರಾಜ್ ತಂಗಡಗಿ ಅವರು "ಶುಭವಾಗಲಿ" ಪದ ಬರಿಯೋಕೆ ಕಷ್ಟಪಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ ಈಗ ವೈರಲ್ ಆಗುತ್ತಿದೆ. pic.twitter.com/UHqaljNxlQ
— Belagavi - ಬೆಳಗಾವಿ (@BelagaviKA) February 1, 2025
Also Read: హైదరాబాద్‌లో ఏఐ యూనివర్సిటీ.. మంత్రి శ్రీధర్ బాబు సంచనలన ప్రకటన
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొప్పల్ జిల్లాలోని జరిగిన ఓ కార్యక్రమంలో కన్నడ భాష, సాంస్కృతికశాఖ మంత్రి శివరాజ్ తంగడగి పాల్గొన్నారు. కరటగి అనే గ్రామంలో ఆయన అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లారు. అక్కడ గదిలో బోర్డుపై కన్నడలో 'శుభవాగలి' ( తెలుగులో శుభాకాంక్షలు) అనే పదం రాసేందుకు తిప్పలు పడ్డారు. తొలుత తప్పుగా రాయగా పక్కనున్న వారి సాయంతో అక్షర దోషాలను మార్చి రాశారు.
Also Read: ఆప్ 55 స్థానాల్లో గెలుస్తుంది.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఇలాంటి వ్యక్తిని కన్నడ భాష, సాంస్కృతిక మంత్రిగా నియమించినందుకు సీఎం సిద్దరామయ్యపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. కర్ణాటక బీజేపీ కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. సిద్దరామయ్య ప్రభుత్వం కన్నడను కూనీచేస్తోందంటూ విమర్శించింది. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పకు కూడా కన్నడలో చదవడం, రాయడం రాదని.. ఇప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి ఓ సాధారణ పదాన్ని రాసేందుకు ఇబ్బందులు పడ్డారంటూ సెటైర్లు వేసింది.
Also Read: ''అయ్యో మేడమ్''.. కాలుజారి కింద పడిపోయిన మేయర్ విజయలక్ష్మి, వీడియో వైరల్
Also Read: రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు