Ashwini Vaishnaw : రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.  రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్లు,  తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఢిల్లీ మీడియాకు వివరాలను వెల్లడించారు.

New Update
ashwini vaishnaw

ashwini vaishnaw

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.  రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్లు,  తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఢిల్లీ మీడియాకు వివరాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు.  

ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేశామన్నారు.  త్వరలో తెలంగాణకు నమో భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్‌ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు.  2026లోపు దేశమంతా ఈ టెక్నాలాజిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు

ఇక  ఏపీలో రూ.84 వేల 559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయన్న మంత్రి..  100 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పూర్తయిందని, 1560 కి.మీ.కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామని వెల్లడించారు.   ఏపీ సీఎం చంద్రబాబు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అశ్విని వైష్ణవ్‌. 8 వందే భారత్ రైళ్లు 16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవాలందిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని గుడ్ న్యూస్ తెలిపారు. 

Also Read :  ఈ పెళ్లి కూతురు పాట వింటే పడి పడి నవ్వుతారు!.. వగలమారి వదిన.. దేవత లాంటి అత్తమ్మ అంటూ..!

పేదవర్గాల కోసం అమృత్ భారత్‌ రైళ్లు నడుపుతున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. అమృత్ భారత్‌ రైళ్ల ద్వారా పేదలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు.  ఇటీవల స్విట్జర్లాండ్‌ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్‌లను పరిశీలించామని..  రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్‌ వ్యవస్థను పాటిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. 

Also Read :  Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు