Social Media: కర్ణాటక సర్కార్ షాకింగ్ నిర్ణయం.. రాష్ట్రంలో సోషల్ మీడియాపై నిషేధం

కర్ణాటక CM సిద్ధరామయ్య శుక్రవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ప్రవేశపెడుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కఠినమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

New Update
_social media

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) (మార్చి 6) శుక్రవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ప్రవేశపెడుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కఠినమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read :  మోదీ జాతకంలో యుద్ధం.. పాకిస్తాన్‌పై ఇండియా ఆ రోజు దాడి చేయనుందా?

Karnataka Government Bans Social Media

స్మార్ట్‌ఫోన్ల వాడకంతో పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురవుతున్నారని, దీనివల్ల వారి కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ దెబ్బతింటున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఇటువంటి నిషేధాలను అమలు చేస్తున్నాయి. అదే తరహాలో పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుండి రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ అడుగు వేసింది. సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 17వ సారి. తద్వారా కర్ణాటకలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు.

Also Read :  పెళ్లికి ఒకే కారులో విజయ్-త్రిష.. విడాకుల వివాదం తర్వాత ఫస్ట్ టైం!

నిర్ణయం వెనుక కారణాలు

సోషల్ మీడియా(No Social Media) లో పిల్లలు సైబర్ బుల్లీయింగ్, అనుచిత కంటెంట్, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా చూడటం తన బాధ్యత అని సీఎం(karnataka cm siddaramaiah) స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్ రహిత మండలాలుగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిషేధాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై ఐటీ, న్యాయ, విద్యా శాఖలు కలిసి పనిచేస్తాయి. వయస్సు నిర్ధారణ కోసం కఠినమైన నిబంధనలను రూపొందించనున్నారు. అలాగే పాఠశాలల్లో "మొబైల్ వీడండి - పుస్తకం పట్టండి" వంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు