Kaman Bridge: 6 సంవత్సరాల తరువాత తెరుచుకున్న పాక్‌-ఇండియా మధ్య వంతెన!

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం.

New Update
kaman

kaman

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. భారత్-పాక్ విభజన, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత  ఈ వంతెనను తిరిగి మరోసారి తెరిచారు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం. ఇది రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మానవతా చర్యగా చెప్పుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు!

మార్చి 5న, జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన యువకుడు, మహిళ జీలం నదిలో విషాదకరంగా మునిగి చనిపోయారు అని ఇండియన్ ఆర్మీ తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు నది ప్రవాహం దాటికి సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలను వెలికి తీసేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. యువకుడి మృతదేహం భారత్ వైపు మొదటగా కనిపించింది. 

Also Read: IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!

మృతదేహాన్ని వెలికితీసే లోపే ప్రవాహంలో ‘‘నియంత్రణ రేఖ’’ అవతలకు కొట్టుకుపోయింది. ఇది చివరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని చినారి సమీపంలో పాక్ వైపు కనిపించింది. అక్కడి అధికారులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుంది. యువతి మృతదేహం కూడా పీఓకేలో స్వాధీనం చేసుకున్నారు. వీరి మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి ‘‘శాంతి వంతెన’’గా పిలిచే కమాన్ వంతెనను మానవతా దృక్పథంతో శనివారం తెరిచారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు సహకరించుకున్నారు.

 ఈ వంతెనను 2005లో ప్రారంభించారు. అయితే, 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడుల తర్వాత ఈ వంతెనను మూసి వేశారు. గతంలో ఈ వంతెన జమ్మూ కాశ్మీర్, పీఓకే మధ్య ప్రజల రవాణాకు ఉపయోగించేవారు. ఇరు వైపుల ఉన్న బంధువులు ఒకరినొకరు కలుసుకునేందుకు ఉపయోగపడింది. మూసేసిన 6 ఏళ్ల తర్వాత విషాద ఘటన కారణంగా మళ్లీ తెరిచారు.

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

 latest-news | bharat | loc | pak | kaman bridge | latest-telugu-news | latest telugu news updates | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు