భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

ఇండియా అణుశక్తి వాస్తులిల్పి డాక్టర్ శ్రీనివాసన్ మంగళవారం మరణించారు. 95ఏళ్ల జీవితంలో అణు రంగంలో గొప్ప సేవలు అందించారు. అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. తమిళనాడుకు చెందిన NPCILను స్థాపించారు. అణు విద్యుత్ బోర్డు, NPCIL చైర్మన్‌గా పని చేశారు.

New Update
MR Srinivasan

ఇండియాలో గొప్ప శాస్త్రవేత్త కన్నుమూశారు. న్యూక్లియర్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయనే డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్. తమిళనాడులోని ఉదగమండలంలో 95 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఇండియా న్యూక్లియర్ స్వావలంబన సాధించాలని ఆయన కృషి చేశారు. డాక్టర్ శ్రీనివాసన్ ఇండియా న్యూక్లియర్ ప్రొగ్రామ్స్‌కు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టారు. 1955లో ఆయన అణుశక్తి శాఖలో తన వృత్తిని ప్రారంభించి, ఐదు దశాబ్దాల పాటు దేశం కోసం పనిచేశారు. 1956లో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సర నిర్మాణంలో ఆయన డాక్టర్ హోమీ భాభాతో కలిసి పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాసన్‌ను భారతదేశ అణు వాస్తుశిల్పి అని పిలుస్తారు.

1959లో ఆయన దేశంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రానికి చీఫ్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. 1967లో ఆయన మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రాజెక్ట్ ఇంజనీర్ అయ్యాడు. 1974లో ఆయన DAE పవర్ ప్రాజెక్ట్స్ డివిజన్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 1984లో అణు విద్యుత్ బోర్డు ఛైర్మన్ అయ్యాడు. అదే సంవత్సరంలో ఆయన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ను స్థాపించి, దాని మొదటి ఛైర్మన్ అయ్యాడు. ఆయన నాయకత్వంలో ఇండియాలో 18 అణు విద్యుత్ కేంద్రాలు డెవలప్ అయ్యాయి. డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ కృషి కారణంగా భారతదేశం అణుశక్తి రంగంలో వేగంగా అభివృద్ధి చెందింది. 2000 సంవత్సరంలో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఆయన కాలంలోనే క్యాన్సర్ చికిత్స, వ్యవసాయంలో కూడా న్యూక్లియర్ టెక్నాలజీ వాడకం ప్రారంభమైంది. రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో ఇండియా అణుశక్తిలో సహకారాన్ని పెంచుకుంది.

( india nuclear power | Dr. Srinivasan | india | scientist | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు