BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం

చార్మినార్ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు. 

New Update
PM Modi

PM Modi

హైదరాబాద్‌ చార్మినార్ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరగా క్షతగాత్రులు కోలుకోవాలని కోరుకున్నారు. 

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో చార్మినార్ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఏసీ కంప్రెసర్ పేలడం, చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్ల మంటలు ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల వ్యాపారం నిర్వహిస్తూ మొదటి ఫ్లోర్‌లో వ్యాపారి ఉంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో బంధువులు  ఇంటికి వచ్చారు. ఇంటికి ఒకే మెట్ల మార్గం ఉండటంతో బాధితులు బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది కూడా త్వరగా లోపలికి వెళ్లలేకపోయినట్లు సమాచారం. చివరికి నిచ్చెనతో పైకి వెళ్లి, తలపులు పగులగొట్టి లోపికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

 

exgratia | fire accident | charminar | hyderabd news | pm modi

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు