/rtv/media/media_files/2025/09/15/election-commission-2025-09-15-17-10-14.jpg)
Election Commission
Jubilee Hills: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన సత్తా మరోసారి చాటాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పనితీరు బాగుందనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. బీజేపీ కూడా తన ప్రభావాన్ని చాటు కోవాలన్న ఆలోచనతో ఉంది. ఈ క్రమంలో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అనే ఫైట్ నడుస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైన గెలవాలని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్(BRS), బీజేపీలు (BJP) పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక కోసం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Also Read : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం
ఇక ఎన్నికలకు డేట్ దగ్గర పడటంతో ఎన్నికల సంఘం కూడా అదే రీతిలో స్పందిస్తోంది. త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నామనే సంకేతాలు ఇచ్చేలా తాజాగా ఈసీ కీలక అప్ డేట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన ఈసీఐ వివరాలను వెల్లడించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ (జూబ్లీహిల్స్), జమ్ము ,జమ్మూ & కాశ్మీర్ (బుడ్గామ్, హైరోటా), రాజస్థాన్ (అంట), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడ), ఝార్ఖండ్ (ఘట్సిలా), పంజాబ్ (టార్న్ తరణ్) అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
కాగా దేశవ్యాప్తంగా జరగనున్న ఉప ఎన్నికలతో పాటు బిహార్‌లో జరగనున్న ఎన్నికలకు గాను ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర అబ్జర్వర్లుగా ఈసీ 470 మంది అధికారులను నియమించింది. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐఆర్ఏఎస్/ఐసీఏఎస్ అధికారులు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు గాను సంబంధిత అధికారులను నియమించినట్లు ఎన్నికల సంఘం వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 20బి ప్రకారం ఈ పరిశీలకులను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాగా దీపావళి తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.
Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి