Singer Pravasthi మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!

'పాడుతా తీయగా' సింగర్ ప్రవస్తి కీరవాణి, సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు జడ్జీ సీట్లో కూర్చొని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.

New Update

Singer Pravasthi ' 'పాడుతా తీయగా' షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి యూట్యూబ్ లో సంచలన వీడియో రిలీజ్ చేసింది. షో జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సంచలన ఆరోపణలను చేసింది. జడ్జ్ హోదాలో కూర్చొని కంటెస్టెంట్లకు అన్యాయం చేస్తున్నారని వాపోయింది. టాలెంట్ ఉన్నవాళ్లను కాకుండా తమకు నచ్చిన వారిని విజేతలుగా చేస్తున్నారని మండిపడింది.  అంతేకాదు వారు తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. 

మెంటల్ టార్చర్ చేశారు.. 

మ్యూజిక్ ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో పెద్ద సెలెబ్రెటీల పేర్లు ప్రస్తావించినందుకు ఎలాగో నాకు అవకాశాలు రావు. కానీ నిజం అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను అని తెలిపింది. కీరవాణి, చంద్రబోస్‌, సునీత నన్ను మెంటల్ గా హింసించి అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని వాపోయింది. 

సునీత నాపై కక్ష

ప్రవస్తి ఇంకా మాట్లాడుతూ..  షో మొదటి నుంచి నాకు ఇబ్బందులే ఎదురయ్యాయి. నామీద జోకులు వేస్తూ బాడీ షేమింగ్ చేసేవారు. జడ్జెస్ నన్నొక చీడపురుగులా ట్రీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు సింగర్ సునీత నాపై కక్ష పెట్టుకున్నారు. నేను పాట పాడడానికి వేదికపైకి రాగానే ఇబ్బంది కలిగించే విధంగా మొహం పెడతారు. కీరవాణికి నాపై లేనిపోనివి చెప్పేది. అలాగే సింగర్ చంద్రబోస్ నన్ను టార్గెట్ చేశారు. తప్పులు లేకపోవయినా కావాలనే నెగటివ్ కామెంట్స్ ఇచ్చేవారని ఎమోషనల్ అయ్యింది సింగర్ ప్రవస్తి. 

ఎక్స్‌పోసింగ్‌ చేయమన్నారని

అలాగే  ప్రవస్తి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి మాట్లాడుతూ మరో సంచలన ఆరోపణలు చేసింది.  అతడి పాటలు పాడిన వారికే మార్క్స్ ఇచ్చేవారని,  షోలో ఎక్స్‌పోసింగ్‌ చేయమన్నారని ఆరోపించింది. అంతేకాదు కీరవాణి తనతో చాకిరీ చేయించుకుంటా అన్నారని వాపోయింది. పాడుతా తీయగా ఒక ఫ్రాడ్ షో.  చిన్న చిన్న కారణాలతో కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారు.  షోలో నాలా ఇబ్బంది పడ్డవారు చాలా మంది ఉన్నారు.  కానీ,  కెరీర్‌ను వదులుకోలేక ఎవరూ నిజాలు బయటపెట్టంలేదు అని తెలిపింది ప్రవస్తి. 

ఏదైనా అయితే వారే బాధ్యులు 

నా జీవితంతో ఆదుకున్నారు, నా అవకాశాలు లాగేసుకున్నారు. షోలో నాకు అన్యాయం జరిగింది. నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగినా, ఏమైనా చేసుకున్నా..? సునీత, కీరవాణి, చంద్రబోస్,  జ్ఞాపిక ప్రొడక్షన్స్‌దే బాధ్యత అని వీడియో రిలీజ్ చేసింది సింగర్  ప్రవస్తి. 

latest-news | cinema-news | mm-keeravani | singer-sunitha | oscar-award-winner-chandrabose

Also Read: Samantha కొత్త చర్చకు దారితీసిన సమంత 'లైక్'.. విడాకులకు అసలు కారణం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు