జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి సంచలనం సృష్టించింది. పహల్గాంకు 5కిలో మీటర్ల దూరంలో బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే టూరిస్టులు మృతి చెందిన ఈ ప్రాంతానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి విశిష్టత విశేషాలు, అందమైన ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
Pahalgam where green meadows meet snowy peaks in pure Kashmiri bliss pic.twitter.com/qfnmatrSYd
— junni (@Gargantua_10011) April 23, 2025
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
మినీ స్విట్జర్లాండ్
జమ్మూ - కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పహల్గామ్. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన చెట్లు, పచ్చని లోయలు స్విట్జర్లాండ్ మాదిరి ఉంటాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ఈ నగరానికి ఎంతో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది.
Last year I visited Pahalgam, a place known for serene beauty. To hear such a horrific attack took place in this very spot is heartbreaking 💔 #PahalgamAttack #PahalgamTerroristAttack #Pahalgam #Kashmir #KashmirTerroristAttack #kashmirattack #JammuKashmir pic.twitter.com/8c1sKgRVPU
— atharva (@that_atharva) April 22, 2025
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
లిడ్డర్ నది ఒడ్డున
ప్రతి సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర కూడా పహల్గామ్ నుండి ప్రారంభమవుతుంది. పహల్గామ్.. అమర్‌నాథ్ యాత్రకు ప్రవేశ ద్వారం కూడా. ఈ నగరం చుట్టూ పచ్చని పర్వతాలు ఉన్నాయి. ఇది లిడ్డర్ నది ఒడ్డున ఉంది. కాశ్మీర్‌లోని లోయలు స్వర్గంలా కనిపించే ప్రదేశాలలో పహల్గామ్ కూడా ఒకటి. ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులకు పహల్గామ్ ఒక స్వర్గధామం లాంటిది. ఇక్కడ ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వాడి వంటి అందమైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ జరుగుతుంది.
#Pahalgam is one of the most beautiful places on Earth. Especially Baisaran Valley (aka Mini Switzerland) — it's truly breathtaking. A vast green stretch surrounded by misty mountains and pine forests. We visited during the summer of 2017. Unforgettable! pic.twitter.com/j3Kd75p21P
— ஐ... பம்மல்...!! (@iPammal) April 23, 2025
సినిమా షూటింగ్స్
దీనితో పాటు పహల్గామ్ పర్వతాలలో గుర్రపు స్వారీ కూడా సరదాగా ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడ అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా చాలా ఇండస్ట్రీవాళ్ళు తమ సినిమాలను చిత్రీకరించారు. ఇక్కడి గాలి, వాతావరణం అన్నీ మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అంతేకాకుండా అమర్‌నాథ్ యాత్ర ప్రధాన బేస్ క్యాంప్ కూడా ఇక్కడ ఉంది.
Pahalgam is one of the most beautiful places I’ve visited in my life.
— Sreekesh Iyer (@sreekeshiyer) April 23, 2025
Having spoken to a few locals there, the hospitality and overall experience was lovely. It’s sad to see it go through these tough times.
I pray for everyone affected by this attack 🙏 pic.twitter.com/xQWLyWJfEv
Also read : AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!
అమర్‌నాథ్ గుహ ముఖ ద్వారం
అమర్‌నాథ్ గుహ పహల్గామ్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వేసవిలో అత్యధిక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పహల్గాం నుంచి సముద్ర మట్టానికి 3వేలకుపైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లేవారు బైసరన్ పచ్చిక బయళ్ల మీదుగా వెళ్తారు. అయితే శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
I went to Pahalgam 2 years back and it was THE most beautiful place I had seen and that was after I had already been to Switzerland and Austria. Its valleys make you go quiet and just make you keep sitting and staring. That quietude has been shattered today. pic.twitter.com/QzY4FKjIGM
— Ravi Prakash (@ravidinkar) April 22, 2025
కాశ్మీరీ భాషలో పహల్గామ్ అంటే ‘‘గొర్రెల కాపరుల గ్రామం’’ అని అర్థం. ‘‘పుహేల్’’ అంటే గొర్రెల కాపరి.. ‘‘గోమ్’’ అంటే గ్రామం. అలాగే హిందూ సాహిత్యంలో ఈ ప్రాంతాన్ని ‘‘బైల్‌గావ్’’ అని పిలుస్తారు. అంటే ‘‘ఎద్దుల గ్రామం’’ అని అర్థం. ఇది హిందూ దేవుడు అయిన శివుడు అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో తన ఎద్దును ఎక్కడ వదిలిపెట్టాడో సూచిస్తుంది.
militant attack pahalgam | pahalgam | pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam terror attack | pahalgam terrorist attack | terror attack in pahalgam | latest-telugu-news | telugu-news