2025లో చోటుచేసుకున్న ఆసక్తికర రాజకీయ పరిణామాలు ఇవే ..

2025 ఏడాదిలో భారత్‌లో ఎన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఓచోట ప్రభుత్వం మారిపోవడం, మరోచోట అధికార పార్టీ తమ పట్టును నిరూపించుకోవడం లాంటివి జరిగాయి. ఈ ఏడాదిలో జరిగిన ఆసక్తికర రాజకీయ పరిణామాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
What are the major political changes in 2025

What are the major political changes in 2025

ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఎదో ఒక అనుభవాన్ని ఇస్తుంది. కొందరికి మంచి జరుగుతుంది. మరికొందరికి అనుకున్నవి జరగవు. కానీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటారు. ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా చూసుకోవాలని అని అనుకుంటారు. కొందరైతే కొత్త ఏడాది ప్రణాళికలను కూడా వేసుకుంటారు. అంతేకాదు ఒక సంవత్సరంలో అనేక రాజకీయ మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. 2025 ఏడాదిలో భారత్‌లో ఎన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఓచోట ప్రభుత్వం మారిపోవడం, మరోచోట అధికార పార్టీ తమ పట్టును నిరూపించుకోవడం లాంటివి జరిగాయి. అలాగే ప్రభుత్వాలు కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన ఆసక్తికర రాజకీయ పరిణామాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.   

20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మార్పు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకి వచ్చింది. బీజేపీ గెలుపు పూర్తిగా ఢిల్లీ రాజకీయ సమీకరణాలను మార్చేసింది. 2013లో అధికారంలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (APP) వరుసగా 2015, 2020 ఎన్నికల్లో గెలిచింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఏడాది కలిసిరాలేదు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదం

ఈ ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర వివాదాలకు దారి తీసింది. బిహార్‌లో ఎన్నికలకు ముందు అక్కడ 'సర్‌'ను నిర్వహించారు. 60 లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు. దీంతో విపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో కూడా సర్‌ విషయంలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. 

బిహార్ ఎన్నికలు

బిహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి, మహాగఠ్‌బంధన్‌ మధ్య గట్టి పోటీ కొనసాగింది. అయినప్పటికీ అధికార ఎన్డీయే కూటమే తమ పట్టు నిలుపుకుంది. భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి తమ ప్రభుత్వం వస్తుందనుకున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ కుటుంబంలో విభేదాలు కూడా తలెత్తాయి. జేడీయూ చీఫ్ నితీశ్‌ కుమార్‌ పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచింది. మహాగఠ్‌బంధన్‌ మాత్రం కేవలం 35 సీట్లకే పరిమితం అయిపోయింది.   

ఓట్ చోరీ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్‌చోరీపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, బల్క్ రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు విమర్శలు చేశారు. కానీ ఈసీ మాత్రం దీన్ని ఖండించింది. 

Advertisment
తాజా కథనాలు