/rtv/media/media_files/2025/12/28/dulhasti-hydel-power-project-on-chenab-2025-12-28-08-04-08.jpg)
Centre’s green panel gives nod to Dulhasti hydel power project on Chenab
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు సింధూ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్‌కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై విద్యుత్ ప్రాజెక్టు, ఆనకట్టను నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్‌ను కూడా రూపొందించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణులు కమిటీ ఈ ప్రణాళికపై పరిశీలన చేసింది. చీనాబ్ నదిపై దుల్బస్తి స్టేజ్ 2 విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సింధు జల ఒప్పంద ప్రకారం చూసుకుంటే చినాబ్ నది పాకిస్థాన్ పరిధిలోకి వస్తుంది. అంటే పాక్‌కు కూడా ఈ నీటిపై హక్కులు ఉన్నాయి. అయితే ఆ నదిపై విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని భారత్ ప్లాన్ చేయడం ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆందోళన కలగించడం ఖాయమని తెలుస్తోంది.
ఈ విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ అయిన NHPC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.3,277.45 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దుల్హస్తి స్టేజ్ 2 ప్రస్తుతం ఉన్న దుల్హస్తి స్టేజ్ 1 ప్రాజెక్టు మౌలిక సదుపాయాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. దుల్హస్తి స్టేజ్ 1ను390 మెగావాట్లతో నిర్మించారు. దీన్ని 2007లో ప్రారంభించారు. అయితే దుల్హస్తి స్టేజ్ 2 ప్రాజెక్టు కోసం నీరు అవసరం కాబట్టి ఈ దశలో మారుసుదర్ నది నీటిని పాకల్ దుల్ ప్రాజెక్టు ద్వారా దుల్హస్తి ఆనకట్టకు తీసుకొస్తారు.
Also Read: మందుతాగితే ఇంగ్లీష్ అనర్ఘలంగా ఎందుకు మాట్లాడుతారో తెలుసా? విషయం తెలిస్తే షాకవుతారు..
1960 సింధూ జల ఒప్పందం ప్రకారం చీనాబ్ నది పరివాహక ప్రాంతాన్ని భారత్, పాకిస్థాన్ పంచుకుంటున్నాయి. దుల్హస్తు స్టేజ్ 2 ప్రాజెక్టును కూడా ఒప్పందంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ప్లాన్ చేసినట్లు కమిటీ గుర్తించింది. గతంలో ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాకిస్థాన్ నియంత్రణలో ఉండేవి. రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కంట్రోల్‌లో ఉండేవి. పశ్చిమ నదులు పాక్‌కు కేటాయించినప్పటికీ.. భారత్ ఆ నదులను సాగునీటి అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి, గృహ అవసరాలకు కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి వాడుకోవచ్చు.
అయితే సింధు నది ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసిన తర్వత ఆ నది పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల్లో సవాల్‌కోట్, రాట్లే, బర్సర్, పాకల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ 1, 2 ఉన్నాయి. మరోవైపు చీనాబ్ నది పరివాహక ప్రాంతంలో ఇప్పటికే పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. 390 మెగావాట్ల దుల్హస్తి 1, 890 మెగావాట్ల బగ్లిహార్, 690 మెగావాట్ల సలాల్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే రాట్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), మరియు క్వార్ (540 మెగావాట్లు) వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు దుల్హస్తి స్టేజ్ 2 ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్ ఫ్రం రైల్వే స్టేషన్
దుల్హస్తి స్టేజ్ 2 కోస 60.3 హెక్టార్ల భూమి కావాలి. ఇందుకోసం కిష్త్వార్ జిల్లాలోని బంజ్వర్, పాల్మార్ గ్రామాల్లో 62 కుటుంబాలకు చెందిన 8.26 హెక్టార్ల ప్రైవేట్ భూమిని సేకరించనున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారం, పునరావాస సౌకర్యాలు అందించనున్నారు. దులస్తి స్టేజ్ 2 ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది. చీనాబ్ నదిపై మరో ప్రాజెక్టు నిర్మించడం అనేది పాకిస్థాన్‌కు ఆందోళన కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us